![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -459 లో.....శ్రీవల్లి పార్టీలో డ్యాన్స్ చేస్తుంటే .. నువ్వు వట్టి మనిషివి కాదని అందరు కోప్పడుతారు. అప్పుడే శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయం చెప్పడానికి ఆనందరావు తాగి వస్తాడు. తనని చెప్పనివ్వకుండా భాగ్యం ఆపుతుంది. టాపిక్ ని డైవర్ట్ చెయ్యడానికి కామాక్షిని ధీరజ్ సంతకం పెట్టించుకుంటున్న దగ్గరికి భాగ్యం పంపిస్తుంది. కామాక్షి భర్త సంతకం పెడుతుంటే అప్పుడే కామాక్షి వచ్చి.. ఏంట్రా ఏంటి నా భర్తని మోసం చేసి దొంగ సంతకాలు పెట్టించుకుంటున్నావని హాల్లోకి వెళ్తుంది. చూసావా నాన్న మీ చిన్నకొడుకు చేసే పని.. నడిపోడు లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకున్నాడు. వీడు ఏకంగా దొంగ సంతకాలు చేయించుకుంటున్నాడని కామాక్షి అంటుంది.
దొంగ సంతకం ఏంటి? కార్ కొనడానికి లోన్ కోసం షూరిటీ అని ప్రేమ అంటుంది. దాంతో కామాక్షి చెంపచెల్లుమనిపిస్తుంది వేదవతి. ముష్టి రెండు లక్షల కోసం దొంగ సంతకాలు అంటున్నావ్.. మీ నాన్న ఇస్తానంటే వాడే వద్దని అన్నాడని వేదవతి కోప్పడుతుంది. దాంతో కామాక్షి తన భర్తని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అసలేం జరుగుతుంది అని రామరాజు కోప్పడతాడు. మీ నాన్న ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా అని ధీరజ్ తో నర్మద అంటుంది. నాన్నలాగా సొంతంగా ఎదగాలనుకుంటున్నాను.. అందుకే నాన్న కష్టార్జితం వద్దని అంటున్నానని ధీరజ్ అంటాడు. సాగర్ ని మాట్లాడమని శ్రీనివాసరావు సైగ చేస్తాడు. అదేంట్రా అలా అంటావ్.. ఆ ఆస్తులు ఆయన కష్టపడి సంపాదించినవే కదా.. ఇందులో వాటా మనకి ఉంటుంది కదా.. అవి తీసుకొని కార్ కొనుక్కోమని సాగర్ అనగానే అందరు షాక్ అవుతారు. అవును అందులో తప్పేముందని శ్రీనివాసరావు అంటాడు. మీరు గొడవ పెట్టడానికి వచ్చారా అని వాళ్ళ నాన్నతో నర్మద అంటుంది.
ఒరేయ్ చిన్నోడా.. నీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నానని సాగర్ అంటాడు. ఒరేయ్ నువ్వు నాకు సపోర్ట్ గా మాట్లాడడం అవసరం లేదు.. నేను సొంతంగా సంపాదించుకుంటానని ధీరజ్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు ఏంటి నిజం చెప్తానని వెళ్తున్నావని ఆనందరావు మొహంపై వాటర్ కొడుతుంది భాగ్యం. తప్పక చెప్తానని ఆనందరావు అంటుంటే అప్పుడే నర్మద వచ్చి ఏదో చెప్తానంటున్నాడు ఏంటని అడుగుతుంది. ఏం లేదని భాగ్యం అంటుంది. ఇప్పుడు జరిగిన దాంట్లో మీ ప్రమేయం ఉందని అనిపిస్తుందని నర్మద అనగానే అదేం లేదమ్మా అని భాగ్యం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |